ప్రియతమా..
- Nitheesh Katakam
- Mar 21, 2016
- 1 min read

ప్రియతమా..!!
నిన్ను ప్రేమించే నా హృదయం నేల.. నీ అంగీకారం ఆకాశము. ఒప్పుకొని నేలనంటే నీటి బిందువులా కురుస్తావో లేదా అందనంత దూరంలో నక్షతం లా ఉండిపోతవో నీ ఇష్టం..
ప్రియతమా..!!
నిన్ను చేరుకునే నా జీవితం అఖండ జ్యోతివంటిది. నీవులేని జీవితం గాలివానలో వెలిగించిన దీపంలాంటిది.. నిన్ను చూసే నా కళ్ళు నీ పేరు పలికే నా పెదాలు నీ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నవి.. అంగీకరిస్తావో..
లేదా..
రంగులమయమైన లోకంలో నన్ను గుడ్డివాన్ని చేస్తావో మాట్లాడే నా పెదాలను మూగబోయేలా చేస్తావో నీర్ణయం నీదే.
వికసించే పుష్పముపై వాలిన తుమ్మెదల నా మనసుని హత్తుకుంటావో లేదా గులాబీ ముల్లై గుచ్చుకుంటావో ఇక నీ చేతుల్లో..
నిన్ను అందుకునే ఖరీదు జీవతమైతే.. నిన్ను చేరుకోలేని లోకం నాకొద్దు..
అర్ధంచేసుకుంటావని..!!!
నీ ప్రేమతో...
నితీష్ కటకం
Comments